జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది.
హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అద్భుత శతకాలతో చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 328/6 భారీ స్కోరు సాధించింది.
చివరికి 121 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేపై టీమిండియా ఘనవిజయం నమోదు చేసింది.