
క్రిప్టోకరెన్సీల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ అప్రమత్తంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
అయితే క్రిప్టోలకు ఆధారమైన డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ, టోకెనైజేషన్ వంటి సాంకేతికతలను ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్‌లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.