
సౌదీ అరేబియా పౌర విమానాశ్రయాలపై హూతీ తిరుగుబాటుదారులు క్షిపణి, డ్రోన్ దాడులు జరపగా, ముగ్గురు మరణించి 36 మంది గాయపడ్డారు.
దీనికి ప్రతికారంగా సౌదీ కూటమి యెమెన్‌లోని వివిధ ప్రావిన్సుల్లో 82 హూతీ సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది.
పౌరులపై జరిగే క్రూరమైన దాడులను ఉపేక్షించేది లేదని, తీవ్ర పర్యవసానాలు ఉంటాయని సౌదీ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికి హెచ్చరించారు.