
2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇండియా చేస్తున్న ప్రయత్నాలు, 2030 కామన్వెల్త్ గేమ్స్ సన్నాహాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు.
అహ్మదాబాద్‌ను ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2030 ఒలింపిక్ బిడ్, 2029 పోలీస్, ఫైర్ గేమ్స్ నిర్వహణపై చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మనుసుఖ్ మాండవీయ పాల్గొనగా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో చర్చలకు గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.