విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్ట్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
ఈ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ఫ్లయింగ్ ఫిష్ నమూనాలో నిర్మించగా, ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణలను ఏర్పాటు చేశారు.
అంతర్జాతీయ ప్రయాణికులకు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేలా విమానాశ్రయ డిజైన్ మరియు సీలింగ్ పనులను పూర్తి చేశారు.