
యూట్యూబ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్ సంస్థ ఏకంగా 90 నిమిషాల నిడివితో కూడిన హారిజాంటల్ వీడియోల ఫీచర్‌ను తెస్తోంది.
అమెరికాలోని ఎంపిక చేసిన పాడ్‌కాస్టర్లు, స్టాండప్ కమెడియన్లతో ఈ కొత్త ఫీచర్‌ను మెటా సంస్థ పరీక్షిస్తోంది.
మొబైల్ స్క్రీన్లతో పాటు శాంసంగ్, ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి పెద్ద టీవీ స్క్రీన్‌లపై కూడా ఈ సదుపాయాన్ని విస్తరిస్తున్నారు.