
2026 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల సంయుక్త నికర నష్టం రూ. 22,238 కోట్లకు చేరుకుంది.
సంస్థల ఆదాయం 9 శాతం తగ్గి రూ. 71,870 కోట్లకు పరిమితమైందని, ఇది గత ఏడాది రూ. 10,859 కోట్ల నష్టంతో పోలిస్తే రెట్టింపు అని నివేదికలు చెబుతున్నాయి.
ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ, సంస్థను గాడిన పెట్టేందుకు 5 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు.