
విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
మృతుడి తల్లి విజయలక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల్లో రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
పోలీస్ కస్టడీలో దాడి వల్లనే సాయికృష్ణ మరణించాడని ప్రాథమికంగా తేలినందున, బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని సీబీఐ డైరెక్టర్ను ఆదేశించింది.