
కృత్రిమ మేధ వల్ల మరో పదేళ్లలో మనుషులు అంతరించిపోయే ప్రమాదం 50 శాతానికి పైగా ఉందని గూగుల్ మాజీ ఇంజినీర్ నేట్ సోరెస్ హెచ్చరించారు.
ప్రస్తుతం ఆయన మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఏఐ భద్రతపై పరిశోధనలు చేస్తున్నారు.
ఏఐ మానవ నియంత్రణను తప్పించుకుని పనులు చేసే ప్రమాదం ఉందని పేర్కొంటూ, దీని అభివృద్ధిపై నియంత్రణలు అవసరమని అభిప్రాయపడ్డారు.