
ప్రస్తుత సినిమాలు సమాజానికి మంచి సందేశం ఇవ్వడం కంటే, కేవలం బాక్సాఫీస్ కలెక్షన్ల కోసం హింసను, అసభ్యతను గ్లోరిఫై చేస్తున్నాయని నటుడు సుమన్ విమర్శించారు.
కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసే సినిమాల్లోని హింసాత్మక దృశ్యాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, నిబంధనలు కఠినతరం చేయాలని కోరారు.
సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదోవ పడుతున్న తరుణంలో, సినిమాలు వారిని సరైన మార్గంలో పెట్టేలా ఉండాలని ఆయన దర్శక నిర్మాతలకు హితవు పలికారు.