
కర్ణాటకలోని బాగల్కోట్లో నమ్మ క్లినిక్‌లో వైద్యాధికారిగా పనిచేస్తున్న డా.అంకిత యారగల్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఎమ్మెల్యే ఉమేశ్ మెటీ మేనకోడలైన ఆమె విధులకు హాజరుకాకుండానే నెలకు రూ.70 వేలకు పైగా వేతనం తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.
దీనిపై స్పందించిన అధికారులు సదరు వైద్యురాలికి అధికారికంగా నోటీసులు జారీ చేశారు.