
వెండి మార్కెట్‌ను గత 50 ఏళ్లుగా పెద్ద బ్యాంకులు కృత్రిమంగా నియంత్రించి ధరను ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నాయని 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి ఆరోపించారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్ ప్యానెళ్లు, సైనిక అవసరాల్లో వెండికి డిమాండ్ ఉందని, బంగారంలా పెద్దఎత్తున నిల్వ చేయలేమన్నారు.
మార్కెట్ నియంత్రణకు సంబంధించి జేపీ మోర్గాన్ గతంలో చెల్లించిన 920 మిలియన్ డాలర్ల జరిమానాను ఆయన ప్రస్తావించారు.