
నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.