
రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అందరూ మద్దతుగా నిలిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వేగంగా ఎదుగుతోందని, అంతా కలిసి ఈ ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.