
బంగ్లాదేశ్లో గత మార్చి నుంచి తట్టు మహమ్మారి విజృంభించడంతో 1,200 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో ఇప్పటివరకు 2.2 లక్షల మందికి పైగా ఈ ఇన్ఫెక్షన్ సోకిందని, కేవలం 82% మంది పిల్లలకు మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు అందాయని రిపోర్ట్ వెల్లడించింది.
రాజకీయ అస్థిరత వల్ల వ్యాక్సినేషన్ నిలిచిపోగా, తక్షణ నివారణ చర్యలు చేపట్టకపోతే డిఫ్తీరియా వంటి ఇతర వ్యాధులు ప్రబలే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారు.