
తెలంగాణలో పోలీసు శాఖలోని 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలను నియామక మండలి ప్రకటించింది.
ఎస్సై ఉద్యోగాలకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పోస్టుల కోసం మొత్తం 5,77,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.