
పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు కేంద్ర టెలికాం శాఖ సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ పోర్టల్ ద్వారా ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేస్తే ఆ ఫోన్ వేరే సిమ్‌తో పనిచేయకుండా కేవలం ప్లాస్టిక్ ముక్కలా మారుతుంది.
ఫోన్ తిరిగి దొరికిన తర్వాత అన్‌బ్లాక్ ఫీచర్ ద్వారా దాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చుకునే వెసులుబాటు ఉంది.