
రాబోయే 50 రోజులు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో గెలిచే అవకాశాలతో పాటు నిజాయితీ, సమర్థతను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు గతంలో ప్రకటించిన 34 శాతానికి మించి, పార్టీ పరంగా 40 శాతం వరకు సీట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
కూటమి ప్రభుత్వం సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.