
రూపాయి పతనాన్ని అడ్డుకుని డాలర్ల ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్బీఐ ప్రవేశపెట్టిన రాయితీ స్వాప్ పథకానికి భారీ ఆదరణ లభించింది.
ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశంలోకి రూ. 5.4 లక్షల కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నిధుల రాకతో దేశీయ ఆర్థిక వ్యవస్థలో విదేశీ మారకద్రవ్య నిల్వలు బలోపేతం అయ్యే అవకాశం ఉంది.