
భారతదేశపు ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ 'ఏఎంసీఏ' కోసం ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్-రాయిస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం, 110 కిలోన్యూటన్ల సామర్థ్యం గల ఇంజిన్ టెక్నాలజీని రోల్స్-రాయిస్ భారత్‌కు బదిలీ చేయనుండగా, పూర్తి మేధోసంపత్తి హక్కులు భారత్‌కే దక్కనున్నాయి.
డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఏఎంసీఏ మార్క్-2 యుద్ధ విమానాలకు ఈ ఇంజిన్లను అమర్చనున్నారు, దీనివల్ల భారత్ ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీలో స్వయంసమృద్ధి సాధించనుంది.