
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'విశ్వంభర' చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌తో పాటు ఒక నిమిషం నిడివి గల ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) విడుదల చేసింది.
వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా విడుదల ఆలస్యమైన ఈ చిత్రం, మెగా మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.