
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు కానున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది.
దాదాపు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.96,862 కోట్ల అంచనా వ్యయంతో ఈ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ రిఫైనరీ ద్వారా ఏటా 9 నుంచి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించనున్నట్లు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ ప్రకటించారు.