
రూ.1,153.93 కోట్ల విలువైన ఈపీసీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు హైదరాబాద్‌కు చెందిన బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ మంగళవారం వెల్లడించింది.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో 270 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ పీవీ ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించిన ఆర్డరు ఇది.
ఈ ప్రాజెక్టును సంస్థ 6 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది.