
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో జూలై 28న అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఉప్పరపల్లి కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది.
పోలీసులు ఇప్పటికే ఉదయ్ ల్యాప్‌టాప్, ఒక మొబైల్‌ను సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కు పంపగా, ప్రస్తుతం మిస్సైన అతని రెండో మొబైల్ ఫోన్ కోసం సీఐ జ్యోత్స్న నేతృత్వంలో గాలిస్తున్నారు.