
మేక మెదడులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B12, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటాయి.
గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, బీపీ, డయాబెటిస్ ఉన్నవారు మేక మెదడుకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యవంతులు కూడా నెలలో కేవలం రెండు సార్లు మాత్రమే దీనిని తీసుకోవాలని, సరైన పద్ధతిలో ఉడికించి తింటేనే పోషకాలు అందుతాయని నిపుణులు పేర్కొన్నారు.