
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు.
ఈ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందున, తీర్పు వచ్చే వరకు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆగాలని నిర్ణయించామని వెల్లడించారు.
బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా గొడ్డలి పార్టీ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.