
పెరుగుతున్న ముడిసరుకుల వ్యయం మరియు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకి ప్రకటించింది.
ఈ ధరల పెంపు గరిష్ఠంగా రూ.20,000 వరకు ఉంటుందని, కొత్త ధరలు సెప్టెంబర్ నెల నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
గత ఆగస్టులో కూడా మారుతీ సుజుకి రూ.2,500 నుంచి రూ.30,000 వరకు ధరలను సవరించగా, టాటా మోటార్స్ కూడా సెప్టెంబర్ 1 నుంచి ధరలను పెంచింది.