
దేశ రక్షణ మరియు విపత్తుల నిర్వహణ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈఓఎస్-05 (జీశాట్-1ఏ) ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.
ఈ అధునాతన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ శత్రువులపై నిఘాకు కీలకమైన అస్త్రంగా పనిచేస్తుందని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది.