
శ్రీలంకతో గాలే వేదికగా జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ వెల్లడించారు.
కుల్దీప్ యాదవ్ చైనామన్ బౌలింగ్, రవీంద్ర జడేజా అక్యురేట్ లైన్ అండ్ లెంగ్త్, మానవ్ సుతార్ క్లాసికల్ లూపీ స్పిన్లతో ప్రత్యర్థి 20 వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నారని గురువారం ఆయన పేర్కొన్నారు.
సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్నూర్ బ్రార్‌లలో ఒకరికి సపోర్ట్ పేసర్‌గా జట్టులో అవకాశం దక్కనుందని మోర్కెల్ స్పష్టం చేశారు.