
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పీవీసీ గ్రూప్ ఆడి సెంట్రల్ షోరూమ్‌లో హీరో సుమంత్ కొత్త ఆడి క్యూ3 మోడల్‌ను ఆవిష్కరించారు.
ఈ కారు 2.0 లీటర్ ఇంజన్‌తో 190 బీహెచ్పీ శక్తిని, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ వర్చువల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లు ఉన్న ఈ కారుకు ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయని సంస్థ తెలిపింది.