
కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి ఆగస్టు 3న వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, ఒక ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
గల్లంతైన 'ముత్యాలమ్మ' బోటు వివరాలను మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అధికారులకు పంపి సమన్వయం చేసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.