
ఆసియా గేమ్స్‌లో మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్ హరిత భద్ర 23.20 సెకన్లలో గమ్యస్థానాన్ని చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది.
ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరో భారత అథ్లెట్ ఉన్నతి 23.46 సెకన్లలో రేసును పూర్తి చేసి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
సింగపూర్‌కు చెందిన శాంతి పెరీరా స్వర్ణం సాధించగా, చైనా అథ్లెట్ చెన్ యుజీ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.