
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన 8 జీవోలపై తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది.
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంలో తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెక్కుల పంపిణీని నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ పథకాలకు చట్టబద్ధత లేదని, రాజ్యాంగంలోని 202 అధికరణకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేస్తున్నారని పిటిషనర్ విజయ్‌గోపాల్ కోర్టులో వాదించారు.