
అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు.
ఆదివారం సాయంత్రం 'బైట్ ఆఫ్ సియాటిల్' ఆహారోత్సవం జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించగా, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.