
కోడిగుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని, రోజుకు ఒకటి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక మధ్యస్థాయి గుడ్డు ద్వారా 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ అందుతుందని, ఇది ఎముకలు, కండరాల బలానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
డయాబెటిస్, బీపీ ఉన్నవారు గుడ్డు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.