ఉదయం లేదా సాయంత్రం ఎండ వల్ల విటమిన్ డి తయారుకాదని, దీని సంశ్లేషణకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వచ్చే యూవీబీ కిరణాలు అవసరమని హెల్త్‌లైన్ తెలిపింది.
ఎక్కువ మెలనిన్ ఉన్నవారు, సన్‌స్క్రీన్ లోషన్లు ఎక్కువగా రాసుకునేవారు లేదా కిటికీ అద్దాల వెనక నిలబడేవారికి యూవీబీ కిరణాలు సరిగ్గా అందవు.
జీర్ణ వ్యవస్థలో లోపాలు, వయసు పెరగడం, ఊబకాయం వంటి కారణాల వల్ల కూడా శరీరం విటమిన్ డి ని తయారుచేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది.