
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కానిస్టేబుల్ పోస్టులకు 18-22 ఏళ్లు, ఎస్ఐ పోస్టులకు 21-25 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 5 ఏళ్ల సడలింపు కల్పించారు.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది, హోంగార్డులకు గరిష్ట వయస్సులో 40 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.