
ఏపీ లిక్కర్ రవాణా కేసులో అక్రమాలకు పాల్పడినందుకు వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్టు చేసింది.
లిక్కర్ రవాణాలో రూ.18.09 కోట్ల మనీలాండరింగ్ జరిగిందని, అందులో రూ.11.95 కోట్లు కారుమూరి ఖాతాలోకి వెళ్లాయని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
సబ్‌కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాల్లో 50 శాతం వాటాను వసూలు చేయడమే కాకుండా, ఆ నిధులను కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.