
రూ. 2,000 అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లో మళ్లీ ప్రవేశపెట్టనుంది.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 'టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు, 2026' ద్వారా పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007ను సవరించారు.
ఈ ఎండీఆర్ ఛార్జీల భారాన్ని వ్యాపారులే భరించాల్సి ఉంటుందని, సామాన్య వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఉచితంగానే ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.