
ఎమ్మెల్యేల దొంగ సంతకాలను అరికట్టేందుకు అసెంబ్లీలో ఫొటో రికగ్నైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం అమరావతిలో వెల్లడించారు.
ఆరు నెలలుగా అసెంబ్లీకి హాజరుకాని సభ్యులపై అనర్హత వేటు వేసే అంశంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కోరామని ఆయన స్పష్టం చేశారు.
ఆగస్టు 14, 15 తేదీల్లో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణాన్ని సందర్శించేందుకు విద్యార్థులకు, ప్రజలకు అనుమతి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.