
విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు విశ్రాంత ఇంజినీర్‌ను మోసగించి రూ.10 కోట్లు దోచుకున్నారు.
కృష్ణలంకలోని ఓ బ్యాంకు ఖాతా నుంచి బాధితుడు ఈ మొత్తాన్ని నిందితుల ఖాతాలకు డిపాజిట్ చేశారు.
మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.7 కోట్లను ఫ్రీజ్ చేశారు.