
కుప్పంలో జరిగిన వైసీపీ సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ భరత్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయని టీడీపీ నేత ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ భరత్పై బీఎన్ఎస్ సెక్షన్లు 192, 353(1)(బీ), 351(2) కింద కుప్పం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.