
నిజామాబాద్‌లోని వెల్నెస్ సెంటర్ మందుల విభాగంలో ఎలుకల సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఎలుకలు మందుల మాత్రలను కొరికి నాశనం చేస్తుండటంతో రోగులకు అందించాల్సిన ఔషధాల నిల్వ ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో డ్రగ్ స్టోర్ పూర్తిగా అపరిశుభ్రంగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.