
ఆగస్టు 17 నుంచి 23 వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ఇండియా ఓపెన్లో పావురాల సమస్య తలెత్తడంతో, ఈసారి అమెరికా నుంచి తెప్పించిన విష రహిత జెల్, వేట పక్షుల అరుపులను అనుకరించే యంత్రాలను ఏర్పాటు చేశారు.
స్టేడియం పైకప్పు మరమ్మతులు, కొత్త కుర్చీల ఏర్పాటుతో పాటు కోతులు, కుక్కల బెడదను నివారించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో సమన్వయం చేసుకుంటున్నారు.