
విశాఖపట్నంలో రూ. 58,743 కోట్లతో డేటా సెంటర్ హోల్డింగ్స్, రూ. 31,387 కోట్లతో ఏఎం ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అనకాపల్లి జిల్లాలో రూ. 85,200 కోట్లతో 1000 మెగావాట్ల సామర్థ్యంతో 'రెన్యూ' గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు 433 ఎకరాలను కేటాయించారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 11 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.