ఆకుకూరలు, బెర్రీలు, చేపలు, గింజలు మరియు ఆలివ్ ఆయిల్ వంటి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రోటీన్, ఫైబర్ కోసం పప్పులు, చిక్కుడు జాతి గింజలు, ఓట్స్, జొన్నలు వంటి ధాన్యాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని పేర్కొన్నారు.
ప్రాసెస్ చేసిన మాంసం, మైదా, కూల్ డ్రింక్స్ మరియు డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదని సూచించారు.