
అర్నాబ్ తుపాను కారణంగా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 27, 28 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ కుమార్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సెలవును ప్రకటించినట్లు ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.