
అవాంఛిత కాల్స్ మరియు అవాంఛిత ఎస్‌ఎమ్‌ఎస్‌ల బెడదను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
నిబంధనలు ఉల్లంఘించే టెలికాం నెట్‌వర్క్ సంస్థలపై నేరుగా చర్యలు తీసుకునే పూర్తి అధికారాన్ని ట్రాయ్‌కి కట్టబెట్టాలని యోచిస్తోంది.
దీని ద్వారా వినియోగదారులకు స్పామ్ కాల్స్ సమస్య నుంచి గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.