
ఆస్ట్రేలియా మహిళల 'ఎ' జట్టుతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత మహిళల 'ఎ' జట్టు రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 338 పరుగుల భారీ స్కోరు సాధించగా, ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 341 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది.