
పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో వెండి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో దిగుమతులకు అనుమతించింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, వచ్చే ఆరు నెలల కాలానికి సుమారు 6,500 మెట్రిక్ టన్నుల వెండి దిగుమతులకు అనుమతులు లభించాయి.
దిగుమతుల పెంపుతో సరఫరా కొరత తీరి, దేశీయ మార్కెట్లో వెండి ధరపై చెల్లించే అదనపు ప్రీమియం తగ్గుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.